దండోరా దళపతికి శుభాకాంక్షలు

” దండోరా దళపతి కి” శుభాకాంక్షలు….

ఎం,ఈ,ఎఫ్ గజ్వేల్ మండలం అధ్యక్షులు సల్ల శ్రీనివాస్.

సిద్దిపేట ఆగస్టు 18 ప్రశ్న ఆయుధం :

ఎస్సీ వర్గీకరణే లక్ష్యంగా గత 30 సంవత్సరాల నుంచి అనేక రకాలుగా పోరాటం చేస్తూ మాదిగ, మాదిగ ఉపకులాలందరినీ ఐక్యం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించేవరకు అలుపెరుగని పోరాటం చేసి 01ఆగస్టు 2024 రోజున సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా విజయం సాధించిన సందర్భంగా ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు ” దండోరా దళపతి మందకృష్ణ మాదిగకు హైదరాబాదులోని తన నివాసంలో కలిసి ఎం,ఈ,ఎఫ్ గజ్వేల్ మండల అధ్యక్షులు సల్ల శ్రీనివాస్ శాలువాతో సత్కరించి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.ఈ.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి, ఎం,ఈ,ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఉప్పరపల్లి నాగభూషణం, ఎం,ఈ,ఎఫ్ రాష్ట్ర మహిళా కార్యదర్శి బెల్లి శ్యామల , ఎమ్మార్పీఎస్ నాయకులు బలరాం, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now