ఫరీద్ పేట లో పూర్వ విద్యార్థుల బడి బాట
– కామారెడ్డి
ఫరీద్ పేట గ్రామములో ఊరు బడిలో ఓనమాలు దిద్ధి ఉన్నత స్థానంలో ,ఉన్నత ఉద్యోగాల్లో,వ్యాపార రంగాల్లో స్థిరపడ్డ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యములో ఆధ్వర్యములో గురువారం ఇంటింటికి తిరుగుతూ బడి బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పూర్వవిద్యారులు అసిస్టెంట్ ప్రొఫెసర్ వి శంకర్ మాట్లాడుతూ పాఠశాలల్లో మౌలిక వసతులు,ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి పూర్వ ప్రాథమిక స్థాయి నుండే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి, ఊరు బడిని బతికించుకోవడం ప్రతి పూర్వ విద్యార్థిదే బాధ్యత అన్నారు. పాఠశాలలో 6 వ తరగతి నుండే ఐఐటి,నీట్ పోటీ పరీక్షలకు అనుగుణంగా విద్య బోధన ఉండే విధంగా బాధ్యత పూర్వ విద్యార్థులు తీసుకుంటారని, పాఠశాల మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు తగిన ఆర్థిక వనరులు కల్పించేందుకు పూర్వ విద్యార్థులు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు సందిద్దమని అన్నారు. మన ఊరు – మన బడి – మన బాధ్యత అన్న నినాదంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా అందరూ కృషి చెయ్యాలని అన్నారు. ప్రతి తల్లి తండ్రులు మన ఊరు బడిలో మీ పిల్లలని చేర్పించాలని ఇల్లు ఇల్లు తిరుగుతూ తల్లి తండ్రులకి విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమములో పూర్వ విద్యార్థులు పల్లె రమేష్ గౌడ్, ఎంఈఓ రాం మోహన్ రావు,సి ఐ, వెంకట్ రాజ్ గౌడ్, ఉపాధ్యాయులు , బట్ట రాజు, లక్ష్మీరాజం, దీపక్ గౌడ్, వెంకట్ రాములు,చిన్నయ్య,బట్టెంకి బాలరాజు,గోపాల్ రెడ్డి,సాయి రెడ్డి,శ్రీకాంత్, బాలరాజు గౌడ్, ఎల్ల గౌడ్,సురేష్,నాగరాజు,సత్యం రెడ్డి,వీర చారి, లక్ష్మీనారాయణ లతోపాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.