ఆర్ కృష్ణయ్యను ఘనంగా సన్మానించిన కామారెడ్డి జిల్లా బీసీ నాయకులు

*ఆర్ కృష్ణయ్యను ఘనంగా సన్మానించిన కామారెడ్డి జిల్లా బీసీ నాయకులు*

ప్రశ్న ఆయుధం న్యూస్, కామారెడ్డి :

కేంద్ర ప్రభుత్వం జనగణనలో భాగంగా కులగణన చేయాలని నిర్ణయించడంలో కీలకంగా వ్యవహరించిన సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఎంపీ (రాజ్యసభ), జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్యని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యంలను మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత, బీసీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్, బీసీ యూత్ జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గౌడ్, జిల్లా సోషల్ మీడియా ఇన్చార్జి రాజేందర్ , కూచి పెంటయ్య , వివిధ జిల్లాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now