ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పారిశుద్ద కార్మికులతో కలిసి కేక్ కట్ చేసిన సత్యం శ్రీరంగం
ప్రశ్న ఆయుధం మే01: కూకట్పల్లి ప్రతినిధి
” కార్మికుల హక్కులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది – సత్యం శ్రీరంగం.”
” దేశ నిర్మాణంలో కీలక భూమికలైన కార్మికులు, వారి శ్రమను, శక్తిని ప్రతి ఒక్కరం గుర్తించి, గౌరవించాల్సిన అవసరం ఉంది – సత్యం శ్రీరంగం. ”
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజపుత్ ఆధ్వర్యంలో బాలాజీనగర్ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం , అనంతరం పారిశుద్ద కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు. కార్మికులను ఆత్మీయంగా పలకరించి వారిని శాలువాతో ఘనంగా సన్మానించి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అని పలు నినాదాలు చేసారు. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భావం ఏ ఒక్క దేశం, సంఘటనకో పరిమితం కాదు.. శ్రమ దోపిడీని నిరసిస్తూ యావత్ ప్రపంచ కార్మికుల్లో స్ఫూర్తిని రగిలిస్తూ వేసిన ముందడుగే ‘ మేడే ‘ అని అన్నారు. జిహెచ్ఎంసి కార్మికుల శ్రమ చాల గొప్పదని, ఉదయం లేచి రోడ్లు ఊడవడం లాంటి అనేక పనుల్లో శ్రామికుల శ్రమను గుర్తించాలన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, వారికి సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. శ్రమకి తగిన గౌరవం లభించాలి. వృద్ధి లక్ష్యాల్లో కార్మికుల పాత్ర ఎనలేనిది అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గానికి తగిన ప్రాధాన్యం ఇస్తుందని వారి సమస్యలకు అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్మికులు దేశ నిర్మాణంలో మేలిమి కఠిన శ్రమతో తమ వంతు పాత్రను నిబద్ధతతో పోషిస్తున్నారు. అయితే, ఈ రోజుల్లో వారు ఎదుర్కొంటున్న సమస్యలను తగిన వేతనాలు, భద్రత, న్యాయమైన ఉద్యోగ ప్రమాణాలు ఇవ్వడం మా ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు, వారికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన నిలుస్తుంది. కార్మికుల హక్కులు కాపాడేందుకు ప్రతి స్థాయిలో పోరాడతాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు, అల్లాపూర్ డివిజన్ అధ్యక్షులు మొయినుద్దీన్, ఎఎమ్సి వైస్ చైర్మన్ ప్రకాష్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెపు నాగరాజు, యూత్ నాయకులు జహంగీర్, సీనియర్ మహిళా నాయకురాళ్లు స్వరూప గౌడ్, బండి సుధ, ఆలయ కమిటీ సభ్యులు శ్రీకాంత్ ముదిరాజ్, పవన్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.