హైదర్ నగర్ కి చెందిన కాంగ్రెస్ నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరిక
ప్రశ్న ఆయుధం మే 01: కూకట్పల్లి ప్రతినిధి
హైదర్ నగర్ కి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎంఎ.ఖదీర్, ఖలీమ్ భాయ్, ఆసిఫ్, బాబా ఖలీం, షాజీర్ , యాసిన్ అహ్మద్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు విసిగెత్తిపోతున్నారని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయిందని గత 10 ఏళ్ల లో కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప ఒక్క మంచి కార్యక్రమం పూనుకున్నది లేదని అందుకనే తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి చెందుతుందని ఆశాభావంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరామని తెలిపారు.