*ముంబైలో కార్మికులచే మేడే, మహారాష్ట్ర దినోత్సవం*
ప్రశ్న ఆయుధం మే 01: గురువారం ఉదయం, మజ్దూర్ మజ్దూర్ భాయ్ భాయ్ మజ్దూర్ సంఘటన (యూనియన్) ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం, సంయుక్త మహారాష్ట్ర దినోత్సవాలు ముంబైలోని విలేపార్లే నాకా/ అడ్డా వద్ద ఘనంగా నిర్వహించారు. ఆరంభంలో మహారాష్ట్ర స్థాపన కోసం అమరులైన 105మంది ఆందోళనకారులకు, షికాగోలో షాహిద్ ఐన శ్రామికులకు జోహార్లు తెల్పారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కార్మికులు తమ హక్కుల కోసం ఉద్యమించాలని, మరోవైపు శ్రమజీవులు తమ పిల్లల భవిష్యతును దృష్టిలో ఉంచుకొని మద్యపానం, డ్రగ్స్, దృమపాణీయాలకు దూరం ఉండాలని హితబోధ చేశారు. ఈ మేరకు పలు ఆదర్శ కార్మికులకు మెమెంటో ఇచ్చి శాల్వా కప్పి సన్మానించారు. సభకు అతిథులుగా శివసేన (యుటిబి) వార్డు అధ్యక్షులు బీజాల పడయ, సునీల్ షా, హన్సరాజ్ గుప్తా, రోహిత్ మోహితే, శాఖ ప్రముఖులు సంజయ్ జాదవ్, బ్రహ్మకుమారి తపస్విని హాజరై సంబోధించారు. యూనియన్ అధ్యక్షులు రమేష్ చౌవల్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, కోశాధికారి నరపాక లక్ష్మణ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. యూనియన్ నాయకులైన గాజుల మహేష్, కుంబి నారాయణ, బందేల బాబు, కాశీం భాయ్, పోషన్న, రమేష్, జి.శంకర్ మాలజీ తదితర్లు సభను విజయవంతం చేశారు.