మే డే శుభాకాంక్షలు…ఎం. శ్రీనివాస్ కుమార్

* *మే డే శుభాకాంక్షలు**

=============

ప్రముఖ వ్యాపారి సామాజికవేత ఎం. శ్రీనివాస్ కుమార్

మే డే సందర్భంగా ప్రముఖ వ్యాపారి సామాజికవేత ఎం. శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు. శ్రామికులందరికీ మే డే కార్మిక హక్కుల దినం. కార్మిక హక్కుల కొరకు పోరాడే దీక్షా దినం.

కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను యాజమాన్యం, యంత్రాంగం పాలకవర్గం అమలు చేయాలి. కాని కొన్ని సార్లు క్రమంగా బలహీన పరుస్తోంది, రద్దు చేస్తోంది, పెట్టు బడిదారులకు అనుకూలంగా మార్పులు చేస్తోంది.

ఆ విధంగా మే డే హక్కులదినం గా గాక, ఉన్న హక్కులను కాపాడుకొనే దినంగా పరిణమించింది. ముఖ్యం గా 8 గం. పనిదినం క్రమంగా పెరుగుతోంది. తద్వార శ్రమ పెరగడం జరుగుతుందని, అధిక పనిగంటలను కార్మిక వర్గం ప్రతిగటించాలి.

కార్మికులు పోరాడి సాదించుకున్న హక్కులన్నింటినీ సంఘటితమై రక్షించుకోవాలి. ఇప్పటికి హక్కుల కొరకు కార్మిక వర్గం పోరాడుతూనే వుంది.

అందుకే కార్మికులు ఆప్రమత్తం గా వుండి వాటి రక్షణ, భద్రత, అవసరాల కోసం పోరాడటానికి సిద్ధంగా వుండాలి.

కార్మిక వర్గం కూడా సాధించున్న హక్కులను కాపాడు కుంటూ, కొత్త హక్కుల కొరకు అవసరాల కోసం పోరాడాలని ఎం. శ్రీనివాస్ కుమార్ పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now