ఎం ఐ జి కాలనీ వాసుల సమస్యలపై పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు ని కలిసిన రవి కుమార్ యాదవ్

ఎం ఐ జి కాలనీ వాసుల సమస్యలపై పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు ని కలిసిన రవి కుమార్ యాదవ్

ప్రశ్న ఆయుధం మే02: కూకట్‌పల్లి ప్రతినిధి

భారతీయ జనతా పార్టీ శేర్లింగంపల్లి అసెంబ్లీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, అసెంబ్లీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు, శేర్లింగంపల్లి సీనియర్ నాయకులు తోపుకొండ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిహెచ్ఎల్ ఎంఐజి కాలనీ వాసులతో కలిసి మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ని కలిసి బీహెచ్ఈఎల్ నిర్మించతలపెట్టిన ప్రహరీ గోడ నిర్మాణాన్ని యాజమాన్యంతో మాట్లాడి అట్టి నిర్మాణాన్ని నిలిపివేసి అందరికీ ఆమోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని ఎంపీ కి విన్నవించుకోవడం జరిగింది ఈ సందర్భంగా సానుకూలంగా స్పందించిన రఘునందన్ రావు నేను బిహెచ్ఎల్ సందర్శించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుని తప్పకుండా ఎంఐజి వాసులకు న్యాయం జరిగే విధంగా మాట్లాడుతానని మాట ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నారాయణరావు, జనార్దన్ రెడ్డి, రాములు, పెంటయ్య గౌడ్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now