గాంధారి ప్రభుత్వ హాస్పిటల్ లో అందుబాటులో లేని డాక్టర్..?

*గాంధారి ప్రభుత్వ హాస్పిటల్ లో అందుబాటులో లేని డాక్టర్..!

పర్యవేక్షించాల్సిన అధికారులు ఏక్కడ..?

తనిఖీలు శూన్యం..?

IMG 20250502 WA2501 ఆయుధం న్యూస్ మే 02 కామారెడ్డి జిల్లా

IMG 20250502 WA2505 గాంధారి గ్రామంలో గల ప్రభుత్వ హాస్పిటల్ లో అందుబాటులో ఉండాల్సిన డాక్టర్ సమయానికి రాక ప్రజలు చాలా ఇబ్బందికి గురయ్యారు.

IMG 20250502 WA2500 సరియైన సమయానికి రాకపోవడంతో రోగులకు ఇతర ఉద్యోగులు ఓపి రాసి వారికి మందులు ఇచ్చి పంపించడం జరిగింది. అక్కడ ఉన్న ప్రజలు డాక్టర్ ఎక్కడ అని ఇతర రోగాలకు సైతం డెంటల్ డాక్టర్ తో చూపెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే హాస్పిటల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. బాత్రూం డోర్ కు గొల్లం లేకపోవడంతో టేబుల్ అడ్డు పెట్టడం జరిగింది. అలాగే వాటర్ ప్యూరిఫై పని చేయక వేసవికాలం దాహం తీర్చుకోవడానికి కనీసం నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. హాస్పిటల్స్ సూపర్డెంట్ ని ప్రశ్నించగా నేను లీవ్ లో ఉన్నాను మేడం వస్తుంది అని చెప్పడం జరిగింది. కానీ ఎంతసేపు ఎదురు చూసిన మేడం రాక ఒక బాలుడికి ఫిట్స్ రావడంతో అక్కడ ఉన్న సిబ్బంది త్వరగా స్పందించి అతనికి చికిత్స అందించడంతో ఆ బాలుడు స్పృహలోకి రావడం జరిగింది. బాలుడు నాగులూర్ గ్రామానికి చెందిన వ్యక్తి అతని తండ్రి సురేష్ ఇలాంటి పరిస్థితుల్లో కూడా డాక్టర్లు అందుబాటులో లేకపోతే ప్రాణాలు పోయినా పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ స్టాఫ్ నర్స్ ని అడగడంతో ఆమె జయవర్ధన్ కు తెలుసు అని సమాధానం ఇచ్చారు. అసలు జయవర్ధన్ ఎవరు..? హాస్పటల్ సూపర్డెంట్ ఆ..? లేక హాస్పిటల్ ఉన్నత స్థాయి అధికారా..? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మొత్తం వ్యవహారం ఈ ఉద్యోగి నడిపిస్తున్నారని దీనికి కారణం ఎవరని రోగులు ప్రశ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now