*పన్ను వసూళ్లలో మొదటి స్థానంలో నిలిచిన మున్సిపాలిటీకి మూడు కోట్ల నిధుల ప్రొసీడింగ్ పత్రం అందజేత*
*జమ్మికుంట మే 2 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానం సాధించినందుకు గాను మున్సిపల్ సెక్రటరీ టి. కే. శ్రీదేవి (ఐఏఎస్) కోట్ల నిధుల ప్రొసీడింగ్ అందజేశారు అనంతరం మున్సిపల్ సెక్రటరీ శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆస్తి పన్ను వసూళ్లలో 100% ,వసులు చేసి, మొదటి స్థానం సాధించినందుకు గాను, జమ్మికుంట మున్సిపాలిటీకి అరుదైన గౌరవంగా పట్టణ అభివృద్ధికై మూడు కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ కు అందజేసినట్లు తెలిపారు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మార్చి నెలకు ముందుగానే పన్ను వసూళ్లు పూర్తి చేయాలని కమిషనర్ అయాజ్ ను, సిబ్బందిని ఆదేశించారు. పన్ను వసూళ్లలో కష్టించి పని చేసిన మున్సిపల్ సిబ్బందిని మున్సిపల్ సెక్రటరీ శ్రీదేవి అభినందించారు కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ మూడు కోట్ల నిధులు పట్టణంలోని జంక్షన్ లతో మున్సిపాలిటి ఆదాయం సమకూర్చే వాటికి, అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, ఆర్.ఐ. భాస్కర్, ఆర్.ఓ వాణి, మున్సిపల్ అధికారులు మహేష్, బిల్ కలెక్టర్ మొగిలయ్య, పాషా, కుమార్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.