*ఏపీలో ఐసెట్ 2025 హాల్ టికెట్ విడుదల*
*హైదరాబాద్:మే 03*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్స రానికి సంబంధించి యూని వర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఫుల్ టైమ్ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకై నిర్వహించే ఇంటి గ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – ఏపీ ఐసెట్ 2025 రాష్ట్ర వ్యాప్తంగా మే 7వ తేదీన నిర్వహించనున్నారు.
అయితే తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లు విడుదల య్యాయి. డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఇదే. ఈ ఏడాదికి ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష విశాఖ పట్నంలోని ఆంధ్ర యూనివ ర్సిటీ నిర్వహిస్తోంది.
ఇక ఏపీ ఐసెట్ 2025 ప్రవేశ పరీక్ష మే 7వ తేదీన నిర్వహిస్తారు. ఈ ఐసెట్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మే 7వ తేదీన మొత్తం రెండు షిఫ్టులలో ఏపీ ఐసెట్ 2025 పరీక్ష ఉంటుంది.
ఆరోజు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సెకండ్ షిఫ్ట్ పరీక్ష ఉంటుంది. పూర్తి వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.