తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాల్ సెట్ కోచింగ్ బుక్స్ పంపిణీ 

తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాల్ సెట్ కోచింగ్ బుక్స్ పంపిణీ

కామారెడ్డితెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాల్ సెట్ కోచింగ్ బుక్కులను పంపిణీ చేయడం జరిగిందని కామారెడ్డి టీజీవీబీ జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్ అన్నారు.

ఈ సందర్భంగా కామారెడ్డి టీజీవీపీ జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ మాట్లాడుతూ శనివారం ఆర్కె కళాశాలలో విద్యార్థులకు పాలిటెక్నిక్ బుక్స్ అందజేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి పాలిటెక్నిక్ లొ మంచి ర్యాంక్ సాధించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీజీవీపి పట్టణ అధ్యక్షులు ఖలీల్, కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండి సమీర్ ,

కార్యకర్తలు రాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now