గాంధారి తహసీల్దార్ కార్యాలయంసమస్యల నిలయంగా మారింది…!!
ప్రశ్న ఆయుధం న్యూస్ మే 03 కామారెడ్డి జిల్లా
గాంధారి మండల కేంద్రంలో గలతహసీల్దార్ కార్యాలయం సమస్యల నిలయంగా మారింది. రిజిస్ట్రేషన్ లకు, తమ సమస్యల పరిష్కారానికై వచ్చే రైతులకు, ప్రజలకు కనీసం తాగడానికి మంచినీరు కూడా అందుబాటులో లేవని ప్రజలు వాపోయారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులోనే పడిగాపులు కాయల్సి వస్తుందని అన్నారు. కార్యాలయంలో సిబ్బంది సరిపడా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వచ్చిన వారు కూర్చోడానికి బెంచీలు కూడా లేక నేలపైనే కూర్చొనే దుస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి కనీస వసతులు ఏర్పాటు చేయాలని రిజిస్ట్రేషన్ నుండి ప్రభుత్వానికి ఆదాయం వస్తున్న ప్రజలకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు లేక ఎండలో మండిపోతున్న వారికి ఎలాంటి సౌకర్యాలు మాత్రం ఏర్పాటు చేయడం లేదు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ నుండి ఆదాయం వస్తున్న అక్కడ వచ్చే ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం లేదు అని వాపోతున్న ప్రజలు.