అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి

*అర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి*

*ఎంపీడీవో కు వినతి పత్రం ఇచ్చిన గ్రామస్తులు*

*ఇల్లందకుంట మే 3 ప్రశ్న ఆయుధం*

ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన నిరుపేద కుటుంబాలకు కేటాయించాలని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని రాచపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు ఎంపీడీవో పుల్లయ్యకు శనివారం రోజున వినతి పత్రం అందజేశారు

అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామసభలో తమ పేర్లు చదివారని, ఇందిరమ్మ కమిటీ వచ్చిన తరువాత అవి లేకుండా పోయాయని పేర్కొన్నారు అన్నీ ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఆరోపించారు. అర్హుల జాబితా లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భూస అశోక్, నగేష్,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now