*జర్నలిస్టులను సన్మానించిన వాసవి మహిళా క్లబ్,వాసవి సేవక్ సభ్యులు*
*ప్రశ్న ఆయుధం మే 03 కుత్బుల్లాపూర్*
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసే ఎలక్ట్రానిక్,ప్రింట్ మీడియా ప్రతినిధులను పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా నల్ల మల్లీస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నిజాంపేట్ వాసవి క్లబ్ మహిళా అధ్యక్షురాలు నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి, ప్రగతి నగర్ వాసవి సేవక్ సభ్యుల ఆధ్వర్యంలో రిపోర్టర్లను శాలువాలతో సత్కరించి మెమొంటోలను అందించి పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా మిత్రులందరికి పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీడియా రంగంలో విలేకరులు చేసే కృషి ఎనలేనిదని వారు ఏ సమయంలోనైనా వార్తలు సేకరించి ప్రజలకు చేరవేస్తారన్నారు. ఒక్కొక్కసారి వారి ప్రాణాలు కూడా తెగించి వార్తలు సేకరించాల్సి వస్తుందన్నారు. ఎవరు ఏది చేసినా అది ప్రజల్లోకి చేర్చేది రిపోర్టర్ల ద్వారానే అని తెలిపారు. రిపోర్టర్లను సన్మానించడం మాకు చాలా సంతోషకరంగా ఉంది అన్నారు.
ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు నల్ల మల్లీస్ ట్రస్ట్ మహిళలు, ప్రగతి నగర్ వాసవి సేవక్ సభ్యులు పాల్గొన్నారు.