*హలో వడ్డెర..ఛలో ఆలేర్*
*వడ్డె ఓబన్న విగ్రహావిష్కరణ*
*వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య*
*ప్రశ్న ఆయుధం మే 03 కుత్బుల్లాపూర్*
తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డె ఓబన్న పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని, భావితరాలకు వడ్డే ఓబన్న జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకమని వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య అన్నారు.
హలో వడ్డెరా ఛలో ఆలేరు పేరుతో ఆదివారం మే4న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉదయం 10 గంటలకు ఓబన్న విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర వడ్డెర నాయకులు జిల్లా నాయకులు కుల బాంధవులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎత్తరి మారయ్య పిలుపునిచ్చారు.
వడ్డే ఓబన్న జనవరి 11న రేనాటి ప్రాంతంలో జన్మించిన ఓబన్న సంచార జాతి వడ్డెర కులానికి చెందిన వారని, బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్న సమయంలో, రేనాటి పాలేగాళ్లకు కుంఫనీ (కంపెనీ)కి తవర్జీ విషయంలో ప్రారంభమైన ఘర్షణలు, క్రమేపీ సాయుధ పోరాటంలో తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడుగా వడ్డె ఓబన్న నిలిచారని తెలిపారు.
బ్రిటీష్ పాలకుల దౌర్జన్యానికి వ్యతిరేఖంగా వడ్డే ఓబన్న చేసిన పోరాట పటిమను భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి మిత్రుడు, జీవితంలోను, పోరాటంలోను, మరణంలోను స్నేహితుడి వెంట నిలిచిన వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను తెలుసుకోడానికి హలో వడ్డెరా ఛలో ఆలేర్ పిలుపుతో వేలాదిగా తరలి రావాలని కోరారు.