కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన బీసీలకు పూర్తి న్యాయం జనసేన నాయకుడు : ప్రేమ కుమార్

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన బీసీలకు పూర్తి న్యాయం జనసేన నాయకుడు : ప్రేమ కుమార్

ప్రశ్న ఆయుధం మే 03: కూకట్‌పల్లి ప్రతినిధి

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం లేదంటే కులగణన పై తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక ఘట్టం అని కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ అన్నారు.

మోదీ ప్రభుత్వ చారిత్రాత్మక కుల గణన నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జనగణలో భాగంగా కుల గణన నిర్ణయం

సమాజంలో అత్యధిక శాతం జనాభా ఉన్న ప్రత్యేకించి బీసీలకు సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, దేశ సామాజిక బలాన్ని బలోపేతం చేసే దిశగా గొప్ప ముందడుగు అని అన్నారు.

చరిత్రలో చివరిసారిగా కుల గణన 1931లో బ్రిటిష్ ప్రభుత్వం నిర్వహించింది. అప్పటి నుండి, షెడ్యూల్డ్ కులాలు, గిరిజనాల గణన తప్ప, ఇతర కులాలపై అధికారిక గణన జరగలేదు. వాస్తవిక డేటా లేకపోవడం వల్ల అనేక దశాబ్దాలుగా ఓ బి సి లు సహా అనేక వర్గాలకు సరైన విధానాలు రూపొందించడంలో అంతరాయం ఏర్పడింది. 94 ఏళ్ల తర్వాత మోదీ ప్రభుత్వం ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించడం పారదర్శక పాలనకు, నిదర్శనం.కుల గణనపై కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాల ద్వంద్వ వైఖరిని ప్రజలకు తెలియజేయడం అవసరం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తరచుగా కుల గణనను రాజకీయ నినాదంగా వాడింది. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయి కుల గణన చేపట్టడంలో విఫలమైంది. 2010లో యుపిఎ హయాంలో కేవలం సర్వే మాత్రమే నిర్వహించి, సేకరించిన డేటాను పూర్తిగా విడుదల చేయలేదు. పారదర్శకత లేకుండా వ్యవహరించారు. ఎన్డీఏ ప్రభుత్వ దృష్టికోణం స్పష్టంగా ఉంది – వాస్తవిక డేటా ఆధారంగా సంక్షేమ పథకాలు రూపొందించాలి, సామాజిక న్యాయం కల్పించాలి. కుల గణన ద్వారా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విధానాలు రూపొందించేందుకు అవకాశం ఉంటుంది. అవసరమైన వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం, వనరుల పంపిణీ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ చేసినట్టు అయోమయం, విభజన కలిగించే ప్రయత్నాలు బీజేపీ చేయదు. ఐక్యత, పారదర్శకత, అందరికీ అభివృద్ధే మా లక్ష్యం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్ అమలు చేసి, సామాజిక సమరసతను కాపాడిన ఘనత మోదీ ప్రభుత్వదే అని అన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న కుల గణన నిర్ణయం చారిత్రాత్మకమైనది, ధైర్యమైనది. ఇది వెనుకబడిన వర్గాలను శక్తివంతం చేస్తుంది, దేశ సామాజిక, ఆర్థిక పునాదులను బలోపేతం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వార్థం, నిర్లక్ష్యాన్ని ప్రజలకు బహిర్గతం చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలూ దేశ నిర్మాణ దృక్పథంతో ఈ నిర్ణయానికి మద్దతివ్వాలని కోరారు.

Join WhatsApp

Join Now