సీమా ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తి.. క్షుద్రపూజలు చేశారని ఆరోపణ..

*సీమా ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తి.. క్షుద్రపూజలు చేశారని ఆరోపణ..*

పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చి ఓ యువకుడిని వివాహం చేసుకున్న సీమా హైదర్ ఇంట్లోకి గుజరాత్‌కు చెందిన తేజస్ అనే 32 ఏళ్ల వ్యక్తి చొరబడి దాడి చేశాడు. ఈ సంఘటన గ్రేటర్ నోయిడాలో నిన్న రాత్రి జరిగింది. దీంతో పోలీసులు తేజస్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సీమా తనపై క్షుద్రపూజలు చేసిందని అతడు పేర్కొన్నాడు. అయితే అతని మానసిక పరిస్థితి సాధారణంగా లేదని పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now