*ఈ నెల 12న శివాలయంలో భారత సైనికులకు మద్దతుగా విశేష అభిషేకం,కోటి జపం, మహామృత్యుంజయ జపం*
*జమ్మికుంట మే 10 ప్రశ్న ఆయుధం*
భారత సైనికులకు మద్దతుగా వారి క్షేమం కొరకు ఈనెల12న సోమవారం రోజున జమ్మికుంట పట్టణంలో శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం( బొమ్మల గుడి )శివాలయంలో ఉదయం 9:00 గంటలకు అన్నపూర్ణ సేవా సమితి వారు, భక్తుల ఆధ్వర్యంలో 108 లీటర్ల పాలతో 108 కొబ్బరికాయల తో విశేష అభిషేకం కోటి జపము మహా మృత్యుంజయ జపము ప్రారంభము అవుతుందని అన్నపూర్ణ సేవా సమితి వారు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.