సమ్మె నోటీస్ ఇచ్చిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్

*సమ్మె నోటీస్ ఇచ్చిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్*

*జమ్మికుంట మే 15 ప్రశ్న ఆయుధం*

దశాబ్దాల కాలంగా కార్మిక వర్గంలో అనేక ప్రాణాల త్యాగాలు చేసి పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్టులను తీసుకువచ్చిందని దేశంలోని కార్మిక వర్గానికి నష్టం చేసే విధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ చట్టాలను సవరించాలని లేనిపక్షంలో కార్మిక సంఘాలు అన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని ఈనెల 20వ తేదీన జరిగే దేశ వ్యాప్త సార్వతిక సమ్మెకు నోటీస్ ఇవ్వడం జరుగుతుందని స్థానిక ఎంపీడీవోకు తెలిపారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అనుమతించాలని మండలంలోని కార్మికులందరూ సార్వత్రిక సమ్మేలో పాల్గొంటారని ఎంపీడీవో కి సమ్మె నోటీసును తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ అందజేసింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే అంతవరకు ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎండిగ రవీందర్రావు యూనియన్ మండల కార్యదర్శ లద్దునూరి కుమార్, మండల కోశాధికారి మేక మల్ల రాము, కమిటీ సభ్యులు రాజయ్య, సంపత్, తిరుపతి, రవి, మైపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now