డీజే చప్పుల్లదాటికి ఆగిన గుండె

*పెళ్లివేడుకలో అపశృతి*

*పెళ్లి ఊరేగింపులో నృత్యం చేస్తూ హార్ట్ స్ట్రోక్ రావడంతో వ్యక్తి మృతి*

*డీజే చప్పుల్లదాటికి ఆగిన గుండె*

పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 16 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తమహేశ్వరరావు

పాలకొండ మండలం బాసూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది గ్రామంలోని ఒక వివాహ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న వ్యక్తిని హార్ట్ స్ట్రోక్ రూపంలో మృత్యువు కబలించింది. గ్రామానికి చెందిన 36 ఏళ్ళ సుంకరి బంగారునాయుడు పెయింటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నిన్న గ్రామంలో జరిగిన శుభకార్యం ఊరేగింపులో గ్రామస్తులతో కలిసి నృత్యం చేస్తూ గుండె పోటుతో హఠాత్తుగా మరణించాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కళ్ళముందే ఉండే మనిషి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో బాసూరు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Join WhatsApp

Join Now