*అప్పుల బాధతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక చేయూతనందించిన రైతు స్వరాజ్య వేదిక*
*ఇల్లందకుంట మే 16 ప్రశ్న ఆయుధం*
భూమి కౌలు తీసుకొని పత్తి సాగు చేసి సరియైన దిగుబడి రాక మనస్థాపంతో మృతి చెందిన రైతు కుటుంబాన్ని రైతు స్వరాజ్య వేదిక పరామర్శించి ఆర్థిక చేయూతను అందించింది కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని చిన్నకొమటిపల్లి గ్రామానికి చెందిన ముక్క సదయ్య కౌలు రైతు అప్పుల బాధతో 4 సెప్టెంబర్ 2024 నాడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు భూమిని కౌలు తీసుకొని పత్తి సాగు చేసి పంట దిగుబడి రాకపోవడం వలన 4 లక్షల వరకు అప్పులు అయినాయి తెచ్చిన అప్పు తీర్చే మార్గం లేక
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది
ఆతనికి ఇద్దరు కొడుకులు కుటుంబాన్ని రైతు స్వరాజ్య వేదిక తరఫున పరామర్శ చేసి వారి కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీసు సొసైటీ వారికి తెలియజేయగా ఆ సంస్థ ద్వారా రూ.40,000/-లు ఆర్థిక సహాయంతో బర్రె కొని ఇవ్వడం జరిగింది, అనంతరం రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వల్లనే తగిన ఆదాయం రాక తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక కలత చెందిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు ప్రభుత్వ ప్రవేశపెట్టిన 194 జిఓల ద్వారా రైతు ఆత్మహత్య కుటుంబాలకు రూ.6,00,000/-లు, నష్టపరిహారం చెల్లించాలని అదేవిధంగా రైతు ఆత్మహత్య కుటుంబాలను త్రిసభ్య కమిటీ ద్వారా గుర్తించి అర్హులైన కుటుంబాలకు, ఎక్స్ గ్రేషియ చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రైతు ఆత్మహత్య కుటుంబాలకు రైతు స్వరాజ్య వేదిక, ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు బి.కొండల్ రెడ్డి, ముక్క ఐలయ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించగా ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక జిల్లా కమిటీ సభ్యులు కన్నూరి సదానందం, రాచపల్లి సమ్మయ్య , ఇంజం చైతన్య, వెంకటేష్ లు పాల్గొన్నారు.