కిషన్ రెడ్డి, రమేష్ బాబు భేటీ: ‘చలో ట్యాంక్‌బండ్’, రాజకీయాలపై చర్చ

*కిషన్ రెడ్డి, రమేష్ బాబు భేటీ: ‘చలో ట్యాంక్‌బండ్’, రాజకీయాలపై చర్చ*

హైదరాబాద్ ప్రశ్న ఆయుధం మే 16

‘ఆపరేషన్ సింధూర్’ విజయ సంబరాల వేళ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిని డాక్టర్ రమేష్ బాబు శుక్రవారం ఆయన నివాసంలో కలిశారు. శనివారం జరగనున్న ‘చలో ట్యాంక్‌బండ్’ కార్యక్రమం, రాష్ట్ర రాజకీయాలు, స్థానిక సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై ఇరువురు నేతలు చర్చించారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ భేటీలో యుద్ధ పరిణామాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అభివృద్ధి పథకాలు, స్థానిక సమస్యలు, రాజకీయ వ్యూహాలపై కూడా ఇరువురు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.

సమావేశం అనంతరం కిషన్ రెడ్డి, రమేష్ బాబు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ‘చలో ట్యాంక్‌బండ్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చలు జరిగాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

Join WhatsApp

Join Now