చలో ట్యాంక్‌బండ్’కు తరలిరండి: కౌకుట్ల చంద్రారెడ్డి పిలుపు

*’చలో ట్యాంక్‌బండ్’కు తరలిరండి: కౌకుట్ల చంద్రారెడ్డి పిలుపు*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం మే 16

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం ట్యాంక్‌బండ్ వద్ద నిర్వహించనున్న ‘చలో ట్యాంక్‌బండ్’ కార్యక్రమానికి కుల, మత, పార్టీలకతీతంగా అందరూ సహకరించాలని నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

సాయంత్రం రాంపల్లి చౌరస్తా నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. భారత సైనికులు దేశం కోసం చేస్తున్న కృషిని ప్రపంచం మొత్తం కొనియాడుతోందని, వారికి సంఘీభావంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయని, ఆయనకు మద్దతుగా ఈ కార్యక్రమానికి అందరూ తరలిరావాలని కౌకుట్ల చంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశభక్తిని చాటే ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now