*చలివేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్*
పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి మే 17( ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వర రావు
కురుపాం మండలం బియ్యలవలస పంచాయతీ, మూలిగూడ జంక్షన్ లో శనివారం నాడు స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చలివేంద్రాన్ని ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవి తాపంతో ప్రజలు దాహాన్ని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఉపయోగపడుతుందని అన్నారు. ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయడం వలన ఇటువైపుగా వచ్చే ప్రయాణికులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వరి, సర్పంచ్, సచివాలయ సిబ్బంది, తదితరులు ఉన్నారు.