నేడు కర్నూలులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన!

*నేడు కర్నూలులో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన!*

*అమరావతి:మే 17*

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయు డు,ఈరోజు కర్నూలులో పర్యటించనున్నారు నగరంలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర- స్వేచ్ఛాంధ్ర, కార్యక్రమంలో పాల్గొన నున్నారు.

ఆయన ఉదయం 11:25 గంటలకు కర్నూలు విమా నాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11 35 గంటలకు సి క్యాంపు రైతు బజార్ కు చేరుకుం టారు అక్కడ కూరగాయల వ్యర్ధాలను ఎరువుగా మార్చే ప్రక్రియను పరిశీలిస్తారు.

ఇక, సీఎం చంద్రబాబు కర్నూలు సీ క్యాంపు రైతు బజార్‌ను పరిశీలించి స్థానికులతో ముఖాముఖి మాట్లాడతారు. కేంద్రీయ విద్యాలయ వద్ద స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాం ధ్ర పార్క్‌కి శంకుస్థాపన చేస్తారు. కేంద్రీయ విద్యాలయ వద్ద ప్రజావేదికలో పాల్గొని స్థానికులతో ముచ్చటిస్తారు.

మరోవైపు, టీడీపీ కార్యకర్తల సమావేశం లోనూ పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన వారికి అభినందన లు తెలపడంతో పాటు.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా దిశానిర్దేశం చేయనున్నారు..

ఇక, సీఎం చంద్రబాబు పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Join WhatsApp

Join Now