*పసిడి ప్రియులకు ఊరట.. నిలకడగా బంగారం ధరలు..*
ఈ ప్రపంచంలో బంగారానికి ఉన్న క్రేజ్ వేరే దేనికీ లేదని అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బంగారాన్ని మించి ఖరీదైన లోహాలు ఉన్నా.. వేల ఏళ్లనుంచి తిరుగులేని ఆభరణాల లోహంగా కొనసాగుతోంది. ధరించడానికి మాత్రమే కాకుండా పెట్టుబడుల విషయంలోనూ బంగారం టాప్‌లో ఉంటోంది. అయితే, పెట్టుబడులు పెట్టే వారు బంగారం ధరలు పెరగాలని అనుకుంటారు. కొనాలనుకునే వారు తగ్గాలని అనుకుంటారు. నెల రోజుల క్రితం వరకు బంగారం కొనాలనుకునే వారికి ధరలు చుక్కలు చూపాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర లక్ష దగ్గర ట్రేడ్ అయింది. కానీ, భారత్ పాక్ యుద్ధం తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇప్పుడిప్పుడు ధరలు తగ్గుతూ వస్తున్నాయి.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు
గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం నిన్న హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 95130 దగ్గర ట్రేడ్ అయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87200 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 71350 దగ్గర ట్రేడ్ అయింది. ఇక, ఈ రోజు 18,22,24 క్యారెట్ల బంగారం ధరలు పెరగలేదు.. తగ్గలేదు. నిన్నటిలాగే 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు కూడా 95130 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 87200 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, 10 గ్రాముల 18 క్యారెట్ల ధర 71350 దగ్గర ట్రేడ్ అవుతోంది.
వెండి ధరలు
నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 10800 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,08000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాములు, కేజీ వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిన్నటిలాగే ఈ రోజు కూడా 100 గ్రాముల వెండి ధర 10800 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ బంగారం ధర 1,08000 దగ్గర ట్రేడ్ అవుతోంది.