*రేపట్నుంచే భూముల రీ సర్వే*
కేంద్రం మార్గదర్శకాల మేరకు నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం
పైలెట్ పద్ధతిలో ఐదు గ్రామాలు ఎంపిక..
మూడు ఏజెన్సీల బాధ్యతలు,
ఇప్పటికే పూర్తయిన గ్రామాల సరిహద్దుల సర్వే,
కొత్త సమస్యలు వస్తాయేమోనని రెవెన్యూ వర్గాల ఆందోళన
*హైదరాబాద్* ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని పైలెట్ పద్ధతిలో భూములను రీసర్వే కు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామును మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రోన్లు లేదా ప్యూర్ గ్రాండ్ ట్రూతింగ్ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో ఈ సర్వే సోమవారం నుంచి నిర్వహించనుంది.
ఇందుకోసం ఆ గ్రామాల్లో నాలుగు నుంచి ఐదు రోజులుగా భూములు సరిహద్దుల నిర్ధారణ జరుగుతుండగా రేపటి నుంచి సర్వే బృందాలు అక్కడికి వెళ్ళనున్నాయి. ముందుగా మహబూబ్నగర్ జిల్లా గండిడ్ మండలం సాలార్ నగర్, జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొమ్మనపల్లి, ఖమ్మం జిల్లా ఏరుపాలెం మండలం ములుగుమడ గ్రామాల్లోనే సర్వే నిర్వహించాలనుకున్న ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సాహెబ్ నగర్, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు గ్రామంలో కూడా కలిపారు ఈ ఐదు గ్రామాల్లో పైలెట్ సర్వే నిర్వహించేందుకు మూడు ఏజెన్సీలను ఎంపిక చేశారు భూములు రిజర్వేను సర్వే సెటిల్మెంట్ శాఖ పర్యవేక్షిస్తుంది.