చిన్నారి ప్రాణాలు బలిగొన్న మహిళ కారు డ్రైవింగ్ సరదా 

చిన్నారి ప్రాణాలు బలిగొన్న మహిళ కారు డ్రైవింగ్ సరదా

ఒకరు మృతి, ఒకరి పరిస్థితి విషమం

భర్తతో కలిసి కారు డ్రైవింగ్ నేర్చుకునేందుకు గ్రౌండుకు వెళ్లి, అదుపుతప్పి కారుతో చిన్నారులను ఢీకొన్న మహిళ

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పరిధిలోని నవ్య కాలనీలో నివాసం ఉంటున్న మహేశ్వరి అనే మహిళ, కారు నేర్చుకునేందుకు సాయంత్రం 5 గంటల సమయంలో భర్త రవిశేఖర్ తో కలిసి సమీపంలో ఉన్న నర్రెగూడెం గ్రౌండుకు వెళ్ళింది

అదే సమయంలో గ్రౌండులో ఆడుకునేందుకు వచ్చిన శేఖర్, అనురాధ దంపతుల పిల్లలు మణిధర్ వర్మ (10), ఏకవాణి (12)

డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మహేశ్వరి కారును ముందుకు దూకించడంతో, అదుపుతప్పి పిల్లలపైకి దూసుకెళ్లిన కారు

ఇద్దరు చిన్నారులు కారు చక్రాల కింద నలిగిపోవడంతో, అక్కడికక్కడే మృతిచెందిన బాలుడు మణిధర్ వర్మ.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏకవాణి

చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Join WhatsApp

Join Now