*నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం*
తిరుమల :
ఇవాళ అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరగనుంది. తిరుమల లోని పలు మఠాల ఆక్రమణలపై సిద్ధం చేసిన సర్వే రిపోర్టుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.తిరుమలలో బ్రాండెడ్ హోటళ్లను అనుమతించే అంశంపై చర్చించే అవకాశముంది. ఒంటిమిట్ట రామాలయం, స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధికి దాతలను ఆహ్వానించే అంశంపైనా ధర్మకర్తల మండలి చర్చిస్తుంది.