ప్రభుత్వ లక్ష్యాన్ని నీరు కారుస్తున్న రెవెన్యూ అధికారులు …?

భిక్కనూరు మండలంలో కళ్యాణలక్ష్మీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపించాలి..!!

ప్రభుత్వ లక్ష్యాన్ని నీరు కారుస్తున్న రెవెన్యూ అధికారులు..!!

ఎన్నో తప్పులు జరిగినా ఆర్టిఐ ద్వారా సమాధానం తీసుకున్న ఒక్కదాన్నే ఎత్తిచూపుతున్న అధికారులు..!

– పెద్ద తప్పును చిన్న తప్పుగా చూపిస్తున్న తహసిల్దార్..!

– అధికారుల తప్పిదం వల్ల ఒకరు కల్యాణ లక్ష్మికి అర్హలు కాకుండా పోయారు..!

– మేం చేసింది కరెక్టే అంటున్నా బిక్కనూర్ తాసిల్దార్ 

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

IMG 20250517 WA2203

లక్ష్మి పథకం తెలంగాణ ప్రభుత్వం పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించే ఒక ముఖ్యమైన పథకం. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఒకేసారి 1,00,116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశాలు:

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలపై పెళ్లిళ్ల భారం తగ్గించడం.

బాల్య వివాహాలను నిరోధించడం, ఎందుకంటే 18 ఏళ్లు నిండిన వధువులు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

మహిళా సాధికారతను ప్రోత్సహించడం.

ఈ పథకానికి అర్హులు:

వధువు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.

వధువు తప్పనిసరిగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

వధువు షెడ్యూల్డ్ కులం (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగ (ఎస్టి), వెనుకబడిన తరగతులు (బీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈ బీసీ) లేదా మైనారిటీ వర్గాలకు చెందిన వారై ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం ఎస్సీ, ఎస్టీ, బీసీ (పట్టణ ప్రాంతాలు) వారికి 2,00,000 రూపాయలు, మించకూడదు, బీసీ (గ్రామీణ ప్రాంతాలు) వారికి 1,50,000 రూపాయలు మించకూడదు.

దరఖాస్తు విధానం:

ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు తెలంగాణ ఈ-పాస్ పోర్టల్ (https://telanganaepass.cgg.gov.in/KalyanaLakshmi.do) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

కావాల్సిన ముఖ్యమైన పత్రాలు:

వధువు యొక్క ఆధార్ కార్డు.

వధువు యొక్క పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం.

కుల ధ్రువీకరణ పత్రం.

ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఆరు నెలల కంటే పాతది కాకూడదు).

వధువు, తల్లి యొక్క బ్యాంకు ఖాతా వివరాలు.

పెళ్లి పత్రిక (ఐచ్ఛికం).

పెళ్లి ధ్రువీకరణ పత్రం.

పంచాయతీ కార్యదర్శి ఆమోద ధ్రువీకరణ పత్రం.

వధువు యొక్క ఫోటో.

ఈ పథకం పేద కుటుంబాలకు ఒక గొప్ప ఊరటనిస్తుంది. ఆడపిల్లల పెళ్లిళ్లు సజావుగా జరిగేందుకు సహాయపడుతుంది.

కళ్యాణ లక్ష్మి రావాలంటే ఎన్ని నిబంధనలను పాటిస్తూ ఆ తర్వాత కానీ కళ్యాణ లక్ష్మిని సంబంధిత వ్యక్తులకు అందించరు. అలాంటిది బిక్కనూర్ తాసిల్దార్ చిన్న పొరపాటు వల్ల ఒకరి సర్టిఫికెట్ బదులుగా మరొకరి సర్టిఫికెట్ వచ్చిందని, కళ్యాణ లక్ష్మి డబ్బులు అర్హులకే అందాయని చెప్పడం వారికి కల్యాణ లక్ష్మి పథకంపై అవగాహన లేదు…?అనడానికి నిదర్శనం. ఒక కంప్యూటర్ ఆపరేటర్ కొట్టినంత మాత్రాన కల్యాణ లక్ష్మి డబ్బులు రావు అనే విషయాన్ని తాసిల్దార్ గమనించకపోవడం గమనార్వం.

కళ్యాణ లక్ష్మి మంజూరు కావాలంటే ఎంత అధికారులు తనిఖీలు చేయాలో గమనించాలి.

కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం అందించే ముందు వివిధ స్థాయిల్లో తనిఖీలు జరుగుతాయి.

గ్రామ రెవెన్యూ అధికారి లేక పోవడంతో పంచాయతీ కార్యదర్శి: దరఖాస్తు చేసుకున్న తర్వాత, మొదటగా మీ దరఖాస్తును పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయిలో విచారణ చేస్తారు. వారు వధువు యొక్క వయస్సు, నివాసం, కుటుంబ ఆదాయం, కులం వంటి వివరాలను పరిశీలిస్తారు. అవసరమైన పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా ధృవీకరిస్తారు. వారు తమ అభిప్రాయాన్ని, ధృవీకరణ నివేదికను తహసీల్దార్ కార్యాలయానికి పంపుతారు. తహసీల్దార్ కార్యాలయం: పంచాయతీ కార్యదర్శి నివేదిక అందిన తర్వాత, తహసీల్దార్ కార్యాలయంలోని అధికారులు దరఖాస్తు, జతచేసిన పత్రాలను మరోసారి పరిశీలిస్తారు. వారు అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకుంటారు. కొన్ని సందర్భాల్లో, వారు అదనపు విచారణ కూడా చేయవచ్చు. తహసీల్దార్ తమ ఆమోదం తెలిపిన తర్వాత, దరఖాస్తు సంబంధిత సంక్షేమ శాఖ అధికారికి పంపబడుతుంది. సంక్షేమ శాఖ అధికారి: ఇక్కడ అధికారులు మళ్ళీ దరఖాస్తును, తహసీల్దార్ నివేదికను పరిశీలిస్తారు. అన్ని అర్హతలు, నిబంధనలు పాటించారో లేదో చూస్తారు. వీరి ఆమోదం తర్వాతనే ఆర్థిక సహాయం మంజూరు ప్రక్రియ మొదలవుతుంది.

ఎమ్మెల్యే కార్యాలయం (కొన్ని సందర్భాల్లో): కొన్ని నివేదికల ప్రకారం, ఎమ్మెల్యే కూడా దరఖాస్తును పరిశీలించి సంతకం చేయాల్సి ఉంటుంది.

కాబట్టి, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందే ముందు కనీసం ముగ్గురు లేదా నలుగురు అధికారులు వివిధ స్థాయిల్లో దరఖాస్తును తనిఖీ చేస్తారు. క్షేత్ర స్థాయి విచారణతో మొదలై, తహసీల్దార్, సంక్షేమ శాఖ అధికారుల ద్వారా ధృవీకరించబడుతుంది. కొన్నిసార్లు ఎమ్మెల్యే కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే సహాయం అందేలా చూడటానికి జరుగుతుంది. ఇన్నిచోట్ల తనికెళ్ల తర్వాతనే కల్యాణ లక్ష్మి డబ్బులు వస్తాయి. అలాంటిది ఒక్కరికి బదులు ఒకరు సర్టిఫికెట్ పెట్టి కళ్యాణ లక్ష్మి ఎలా మంజూరు చేశారో క్లారిటీ ఇచ్చిన భిక్కనూరు తాసిల్దార్ కి తెలియాలి అని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.

*ఆర్టిఐ ద్వారా సమాచార ఇచ్చిన ఒక్కదాని గురించి మాట్లాడుతున్న అధికారులు*

గతంలో ఉన్న తాసిల్దార్ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన కాలంలో కళ్యాణ లక్ష్మితో పాటు, భూముల రిజిస్ట్రేషన్ల విషయంలోనూ అనేకలు జరగాయని ఆరోపణలు ఉన్నాయి. కానీ వాటినన్నిటిని పరిశీలించవలసిన అధికారులు తమ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారిని కాపాడుకోవడానికి ఆర్టిఐ ద్వారా సమాచారం ఇచ్చిన ఒక్కదానిని మాత్రమే కారణంగా చూపిస్తూ ఏ లాంటి అక్రమాలు జరగలేవని ప్రెస్ మీట్ పెట్టడం గమనర్హం. ఆ తహసిల్దార్ చేసిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపించాలని ప్రజలు కోరుతున్నారు. వారికి అండగా నిలుస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకున్నట్లయితే మరొకసారి ఇలాంటి చర్యలు పునారావృతం కావని ప్రజలు చర్చించుకుంటున్నారు.

భిక్కనూరు తాసిల్దార్ కార్యాలయంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేసేందుకు మరియు ఆధారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ప్రశ్న ఆయుధం తెలుగు దిన పత్రిక యాజమాన్యానికి ఫోన్లు చేస్తూ ఆధారాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఆధారాలతో సహా మరిన్ని అక్రమాలను బయట పెట్టడానికి మరికొన్ని రోజులలో మరిన్ని అక్రమాలకు సంబంధించిన విషయాలను మీ ముందుకు తెస్తాం.

Join WhatsApp

Join Now