లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు..?

లిక్కర్ స్కామ్ నిందితులతో యంగ్ హీరోయిన్ కు సంబంధాలు?

డ్రాగన్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి కయాదు లోహర్

టాస్మాక్ కుంభకోణంలో ఆమె పేరు తెరపైకి

నిందితుల పార్టీలకు హాజరైనందుకు 35 లక్షలు తీసుకున్నట్లు వార్తలు

ప్రస్తుతం తమిళనాట హాట్ టాపిక్‌గా మారిన టాస్మాక్ లిక్కర్ కుంభకోణంలో యంగ్ హీరోయిన్ కయాదు లోహర్‌కు సంబంధాలున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి.

ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో కయాదు లోహర్ కూడా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తతో తమిళ సినీ ప్రేక్షకులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, టాస్మాక్ కుంభకోణంలో భాగస్వాములైన వ్యక్తులు నిర్వహించిన నైట్ పార్టీలకు హాజరైనందుకు కయాదు లోహర్‌కు సుమారు 35 లక్షల రూపాయలు ముట్టాయని తెలుస్తోంది. ఈ ఆరోపణలు నిజమైతే, ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ‘డ్రాగన్’ సినిమాతో వచ్చిన క్రేజ్‌తో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న కయాదు, ఇప్పటికే తమిళంలో యంగ్ హీరోలు అధర్వ, జీవీ ప్రకాష్ చిత్రాలతో పాటు, శింబు సరసన ఒక సినిమాలో నటించే అవకాశం కూడా దక్కించుకుందని సమాచారం. కేవలం రెండు నెలల వ్యవధిలోనే, గత నాలుగేళ్లలో చేసిన సినిమాల సంఖ్యను అధిగమించేంత బిజీగా మారిన సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం గమనార్హం.

ఈ వార్తలపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “ఇది చాలా షాకింగ్‌గా ఉంది. తమిళ పరిశ్రమ కూడా నెమ్మదిగా అవినీతిమయం అవుతోంది” అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై కయాదు లోహర్ వైపు నుంచి గానీ, అధికారిక వర్గాల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. ఈ వార్తల్లో నిజానిజాలు తేలాల్సి ఉంది.

Join WhatsApp

Join Now