మహిళలకు అసలైన రక్షకుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

మహిళలకి అసలైన రక్షకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
…ధర్మ సమాజ్ పార్టీ

మహిళ లోకానికి ఎలాంటి హక్కులు లేకుండా కనీసం సాటి మనిషిగా కూడా మహిళలని చూడని రోజుల్లో అడగకుండానే నవభారత మహిళలకు అన్ని రంగాలలో స్వేచ్ఛ , సమానత్వం, సంక్షేమం భారత రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించిన మహానుభావుడు అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ సందర్భంగా జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ (విగ్రహo) గారి చేతికి ధర్మ రాఖీ కట్టి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారూ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశ పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు ద్వారా కూడా మహిళలకి, శూద్రులకి రాజకీయ మరియు ఇతర అనేక రంగాలలో అనేక హక్కులు కల్పించాలని పార్లమెంటు ముందు నివేదించినప్పుడు ఆనాటి అగ్రవర్ణ ప్రభుత్వం హిందూ కోడ్ బిల్లును నిలువరించి వీగిపోయేలా చేశారు. ఆ సందర్భంలో గొప్ప మానవతావాది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరసనగా, మంత్రి పదవికి మరియు పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది. ఆ విధంగా మహిళలకి స్వేచ్ఛా, స్వతంత్రాలు ఉండరాదని అన్న వారి మరియు నాటి హిందూ కోడ్ బిల్లు వ్యతిరేక శక్తుల వారసులే నేడు రక్షాబంధన్ పేరుతో మహిళా సమాజం పట్ల సన్నాయి నొక్కులు మాట్లాడుతున్నారు. ఈ దేశ అగ్రవర్ణ ప్రభుత్వాల ఏలికలో నేటికీ దేశంలో మహిళలపై అన్ని రంగాలలో వివక్షతోపాటు అనేక ఆగాయిత్యాలకు పాల్పడుతున్న సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్న విషయం అత్యంత సిగ్గుచేటని అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన మార్గంలో మహిళా శక్తి ఒకటిగా ఉండి బీసీ ఎస్సీ ఎస్టీ ల రాజ్యాధికారం సాధించుకోవాలని అప్పుడే మహిళలకు అసలైన రక్షణ ఉంటుందని స్వేచ్ఛ, సమానత్వాలు కలుగుతాయని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకురాలు, జిల్లా నాయకురాళ్లు జ్యోతి, పరమేశ్వరి, ప్రసన్న, అనిత , కవిత తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now