పర్వతారోహకుడు భుక్య యశ్వంత్ ను అభినందించిన జిల్లా ఎస్పీ 

పర్వతారోహకుడు భుక్య యశ్వంత్ ను అభినందించిన జిల్లా ఎస్పీ

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

IMG 20250607 WA0017

తెలంగాణ చెందిన యువ పర్వతారోహకుడు భుక్య యశ్వంత్ హర్ శిఖర్ పర్ తిరంగా మిషన్‌లో భాగంగా మిజోరాం, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఎత్తైన శిఖరాలను విజయవంతంగా అధిరోహించాడు. ప్రతి శిఖరంపై భారత త్రివర్ణ పతాకంతో పాటు కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఫోటోను ప్రదర్శించి వారి నిస్వార్థ సేవకు గౌరవం తెలిపాడు. ఈ సందర్భంగా భుక్య యశ్వంత్, జిల్లా ఎస్పీ ని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, అధిరోహించిన శిఖరాలపై తీసిన ఫోటోను ఎస్పీ కి అందించాడు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర భుక్య యశ్వంత్‌ను అభినందిస్తూ,

“యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యశ్వంత్‌ సాధన గర్వకారణం అని తెలిపారు. భవిష్యత్తులో మరింత ఎత్తైన శిఖరాలను అధిరోహించాలని ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. యశ్వంత్ ఇప్పటివరకు మౌంట్ కిలిమంజారో (ఆఫ్రికా), మౌంట్ ఎల్బ్రస్ (రష్యా), మౌంట్ కోసియస్కో (ఆస్ట్రేలియా), కాంగ్ యాట్సే II, యూనామ్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ తదితర శిఖరాలను అధిరోహించాడు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించడం ఆయన లక్ష్యం.

Join WhatsApp

Join Now