శ్రీ చాముండేశ్వరి కార్యవర్గ సభ్యులను సన్మానించిన ప్రభుత్వ సలహాదారు 

శ్రీ చాముండేశ్వరి కార్యవర్గ సభ్యులను సన్మానించిన ప్రభుత్వ సలహాదారు

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ చాముండేశ్వరి అమ్మ అమ్మవారి నూతన కార్యవర్గ సభ్యుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొని చాముండేశ్వరి ఆలయ కమిటీ నూతన సభ్యులను సన్మానించారు. కమిటీ సభ్యులలో పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి అధ్యక్షులు, నార్ల వెంకటేశం కార్యదర్శి, పోలబోయిన రమేష్, నర్రాగుల ఎల్లం, డైరెక్టర్లుగా ఎన్నుకున్నారు. దోమకొండ మండల కేంద్రంలోని మండల కార్యాలయం వద్ద ఉన్న పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును తనిఖీ చేశారు, మహిళా సంఘాలతో కాసేపు మాట్లాడారు, తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎంతమంది లబ్ధిదారులకు ఎంతమంది ముగ్గులు పోసుకొని పనులు ప్రారంభించారని ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులను, ఎంపీడీవోను, పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. తొందరగా ఇందిరమ్మ ఇల్లు పూర్తిచేయాలని వాళ్లకు ఆదేశాలను జారీ చేశారు, ఇప్పటికే ఆలస్యం అయిందని, దోమకొండ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలలో జాప్యం జరుగుతుందని, లిస్టు చూసి ఇంత లేట్ ఎందుకు అని కూడా అడిగారు, తర్వాత, కొన్ని ఇందిరమ్మ ఇళ్లకు, ముగ్గు పోయడానికి పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో ఇందిరమ్మ కమిటీ సభ్యులను తీసుకువెళ్లి ముగ్గు పోశారు. ఎలక్షన్ కోడ్ వరకు అన్ని ఇందిరమ్మ ఇల్లు పూర్తిగా కంప్లీట్ చేయాలని అధికారులను, కమిటీ సభ్యులను ఆదేశించారు. ప్రతి ఒక్క నిరుపేదలైన సభ్యులకు ఇందిరమ్మ ఇల్లు వచ్చేట్టుగా చూడాలని అధికారులను కమిటీ సభ్యులను ఆయన హెచ్చరించారు. ఎంతమంది లబ్ధిదారులు ఉన్నా, లేని వారిని గుర్తించి త్వరగా పూర్తి చేయాలని వారు కోరారు.

Join WhatsApp

Join Now