*నాగారంలో ‘ఓల్డ్ స్కూల్ కెఫే’ ప్రారంభం: యువత స్వయం ఉపాధిపై దృష్టి సారించాలి – బండారి మల్లేష్ యాదవ్*
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూన్ 8
నాగారం మున్సిపాలిటీ నాలుగో వార్డులో ఆదివారం నాడు “ఓల్డ్ స్కూల్ కెఫే”ని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ, “ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షించకుండా, స్వయం ప్రేరణతో సమాజానికి ఆదర్శంగా నిలవాలనే సంకల్పంతో కెఫే రంగాన్ని ఎంచుకున్న యువకులు శ్రావణ్, అభిలాష్‌లు అభినందనీయం. వీరిని ప్రోత్సహించిన లక్ష్మీనారాయణ చారి పాత్ర కూడా ప్రశంసనీయం,” అన్నారు.
వైద్య, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యను అభ్యసించిన యువత పారంపర్య ఉద్యోగాలకు మించి కొత్త అవకాశాలను అన్వేషించాలనే సందేశాన్ని ఆయన ఇచ్చారు. “తమ కాళ్లపై తామే నిలబడే శక్తి ప్రతి యువతలో ఉండాలి,” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మధుర నగర్ మరియు శ్రీనివాస్ నగర్ కాలనీల కమిటీ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హాజరై, ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు.