*అవినీతి, అక్రమార్కులను సమాజంలో దోషులుగా చూపిద్దాం*
*ఎన్ హెచ్ ఆర్ సి. నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎం ఎ వకీల్*
*పాల్గొన్న రాష్ట్ర కమిటీ సభ్యులు సూర్యవంశీ మాధవరావు పటేల్*
ప్రశ్న ఆయుధం 10జూన్
బైంసా (నిర్మల్ జిల్లా): ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే అవినీతి అక్రమార్కులను సమాజంలో దోషులుగా చూపిస్తామని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ ఎచ్ ఆర్ సి) నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎంఏ వకీల్ అన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు సూర్యవంశీ మాధవరావు పటేల్ తో కలిసి బైంసా పట్టణంలోని రోడ్డు భవనాల విశ్రాంతి భవనంలో జరిపిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలోని అన్ని మండల కమిటీలను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. సామాజిక ఉద్యమకారులు, ఆర్టిఐ కార్యకర్తలు, మేధావులు, విద్యావంతులు తమ సంస్థలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారులు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య సారధ్యంలో బలమైన లీగల్ ప్రొసీజర్, ప్రోటోకాల్ సిస్టంతో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ తమ సంస్థ పనిచేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర మండల అధ్యక్షులుగా నియామకమైన మల్లెల మోజేష్ ను వారు అభినందించారు. రాష్ట్ర, జిల్లా కమిటీల ఆదేశాల మేరకు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్ల హనుమాన్లు, అధికార ప్రతినిధి కాంబ్లే సూర్యకాంత్, నాయకులు అలమాస్ ఖాన్, జప్పర్ అహ్మద్, మథిన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.