*ప్రతి మంగళ శుక్రవారం జరిగే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలి*
*డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ*
*జమ్మికుంట జూన్ 10 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం(CHC) లో మంగళవారం రోజు నుండి జరుగుతున్న ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని డి ఎం హెచ్ ఓ డాక్టర్ వెంకటరమణ డిప్యూటీ డి ఎం హెచ్ వో డాక్టర్ చందు, పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ సన జవేరియా లతో కలిసి సందర్శించారు అనంతరం డి ఎం హెచ్ ఓ డాక్టర్ వెంకట రమణ ఆరోగ్య మహిళ శిబిరానికి వచ్చిన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి మంగళవారం, శుక్ర వారం ఆరోగ్య మహిళా శిబిరం నిర్వహిస్తారని వైద్యురాలు సూచన మేరకు వైద్య పరీక్షలు చేసుకోవాలని సుమారు 56 రకాల వైద్య పరీక్షలు చేస్తారని ప్రతి మహిళ కనీసం మూడు నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కుటుంబం గురించి ఆలోచించే మఒకవేళహిళలు ముందుగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనారోగ్యం బారిన పడితే ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి నష్టపోకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని సూచించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రత, వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ముఖ్యంగా డ్రై డే మీద అవగాహన కల్పించారు. ప్రతి మహిళ ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
*జమ్మికుంట ఆరోగ్య ఉపకేంద్రం-1 ఆకస్మిక తనిఖీ*
డి ఎం హెచ్ ఓ డాక్టర్ వెంకటరమణ ఆరోగ్య ఉప కేంద్రం-1 ను ఆకస్మికoగా తనిఖీ చేసి ఉపకేంద్రం హాజరు పట్టిక రికార్డులను తనిఖీ చేసి పేషెంట్లకు పంపిణీ చేస్తున్న మందులను పరిశీలించారు. ఎన్ సి డి క్లినిక్ లోని అధిక రక్తపోటు డయాబెటిస్ రోగుల వివరాలను వారికి అందుతున్న మందుల వివరాల నమోదును పరిశీలించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు,సివిల్ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ పారిపెల్లి శ్రీకాంత్ రెడ్డి,పిఓఎంసిహెచ్ డాక్టర్ సనజవేరియా , జిమ్మికుంట ఆరోగ్య ఉప కేంద్రం వైద్యాధికారి డాక్టర్ చందన, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.