సాహసోపేత నిర్ణయాలతో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలుపుతున్న వ్యక్తి మోడీ

సాహసోపేత నిర్ణయాలతో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలుపుతున్న వ్యక్తి మోడీ

– ఏళ్ల తరబడి నిరక్షణ కి చరమ గీతం పాడి 370 ఆర్టికల్ రద్దు, రామమందిర నిర్మాణం చేసిన ప్రధాని

-;మోది హయంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది

– ఆర్మూర్ శాసన సభ్యులు రాకేష్ రెడ్డి

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణం చేసి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించరూ. ఈ సమావేశానికి హాజరైన ఆర్మూర్ శాసన సభ్యులు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్న భారతదేశాన్ని సస్యశ్యామల దేశంగా తీర్చి దిద్దుతున్న వ్యక్తి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. 11 సంవత్సరాలుగా దేశాన్ని అన్ని రంగాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందుకుంటున్నారని అన్నారు. దేశ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నారని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేయడమే కాకుండా రామజన్మ భూమిని లో రామాలయాన్ని నిర్మించాడని పేర్కొన్నారు. దేశంలోని అన్ని గ్రామాలకు 90 శాతం నిధులను మంజూరు చేసి రోడ్లను వేయడం జరిగిందన్నారు. నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రభుత్వం కి చరమగీతం పాడి దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాడని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న 22 వేల మంది భారతీయులను మోడీ భారతదేశానికి తీసుకువచ్చారన్నారు. ప్రతి రంగానికి నిధులను మంజూరు చేస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తి దేశానికి దొరకడం మన అదృష్టంగా భావించాలని అన్నారు.

విలేకరుల సమావేశం అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటరూ.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, పైలా కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, నాయకులు నరేందర్, సురేష్, వేణు, సంతోష్, అనిత, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్,బలమని, హారిక, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now