బస్టాండ్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి
ప్రశ్న ఆయుధం 23జులై కామారెడ్డి :
కామారెడ్డి పట్టణంలోని టి ఎస్ ,అర్ ర్టీసీ కొత్త బస్టాండ్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచిన తొందరలోనే మహాలక్ష్మి ఉచిత బస్ పథకం రావడం చాలా సంతోషకరం అన్నారు కామారెడ్డి బస్టాండ్ లో బస్సులో మహిళలతో మాట్లాడి మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు డిపో మేనేజర్ తో మాట్లాడి కామారెడ్డిలో ఉన్న బస్సులు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి సరైన సమయంలో బస్సులు ప్రజలకు, కాలేజ్ విద్యార్థులకు ఇబ్బంది కాకుండా చూడాలని అరుణాచలం కి బస్సు కేటాయించాలని వారు తెలియజేశారు బస్టాండ్లో మరుగుదొడ్లు మరియు మంచి నీళ్లు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని డిపో మేనేజర్ ఇందిరా,కి తెలియజేశారు ఈ కార్యక్రమంలో, మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డ్ కౌన్సిలర్ పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ,సలీం, పంపరి శీను, అనూషప్రసన్న,సుగుణ,తదితరులు పాల్గొన్నారు.