రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ 

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 13

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సురేందర్, అన్నారు.

కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు అన్ని మండలాల కమిటీలు, నియమించాలని, ఆ తర్వాత జిల్లా కమిటీ నియమించాలని, నిర్ణయించడం జరిగిందన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, అత్యధికంగా గిరిజనుల ఓట్లతో గెలిచారన్నారు. అలాంటిది మంత్రివర్గంలో గిరిజనులకు మాత్రం అవకాశం కల్పించకపోవడం అన్యాయమన్నారు. తమపై ఇంత వివక్ష ఎందుకు, చూపిస్తున్నారని ప్రశ్నించారు. కేవలం డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి చేతులు దులుపుకోవడం సరికాదని అభిప్రాయం, వ్యక్తం చేశారు. పదవులు రాని బడా బాబుల ఇంటికి వెళ్లి బుజ్జగిస్తారని, తమకు మాత్రం పదవుల అవకాశం ఇవ్వకపోవడం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో గిరిజన వర్గానికి మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించాలని, తమ కార్పోరేషన్ మాత్రమే కాకుండా ఇతర కార్పోరేషన్ లో కూడా అవకాశం కల్పించాలని కోరారు. అలాగే గిరిజన బిడ్డ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా పోలీసులు ప్రవర్తించిన తీరు సరికాదన్నారు. ఆ వేడుకల్లో డ్రగ్స్, విదేశీ మద్యం లేకున్నా ఆమెను ఇబ్బందులకు గురిచేసి గిరిజన బిడ్డను అవమానించారని, ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 50 శాతం గిరిజనులకు పోడు పట్టాలు, వచ్చాయని, ఈ ప్రభుత్వ హయాంలో అందరికి పోడు పట్టాలు, ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర నాయకులు మోహన్ నాయక్, జిల్లా నాయకులు రెడ్డి నాయక్, సదర్ నాయజ్, ఆనంద్ నాయక్, సర్వన్ నాయక్, రాంచంద్రం నాయక్, శంకర్ నాయక్, ప్రవీణ్ నాయక్, పండిత్ నాయక్, రమేష్ నాయక్, ఓంకార్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now