అత్యాధునిక సదుపాయాలతో ఎలిగేడు లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం: ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు!

*అత్యాధునిక సదుపాయాలతో ఎలిగేడు లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం: ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు!*

పెద్దపల్లి జిల్లా: జూన్ 13

పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శుక్రవారం పర్యటించారు. మొదట మంత్రులు ఎలిగేడు పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా..దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడు తూ… ఎలిగేడు మండలం లో ఏర్పాటు చేసిన 24 సంవత్సరాల తర్వాత స్థానిక ఎమ్మెల్యే కృషి ఫలితంగా నేడు నూతన పోలీస్ స్టేషను ప్రారంభిం చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు అత్యాధునిక సదుపాయల తో ఎలిగేడు మండలంలో పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకున్నామన్నారు.

సామాన్య ప్రజల కష్టాలను పరిష్కరించే దిశగా పోలీస్ అధికారులు నేడు విధులు నిర్వహిస్తున్నారని గ్రామ స్థాయి నుంచి పక్కాగా శాంతిభద్రతలు నిర్వహిం చేలా పోలీస్ వ్యవస్థ పని చేస్తుందని మంత్రి తెలిపారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..గత పాలకులు నాశనం చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ అదే సమయంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలిగేడు మండలానికి అత్యధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. నిరుపేదలను స్పష్టంగా గుర్తించి వారికి సంక్షేమ పథకాలు అందజే యడం జరుగుతుందని అన్నారు.

ఈ సందర్భంగా నూతన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితిని గత పాలకులు విచ్ఛిన్నం చేసినప్పటికీ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని అన్నారు. గత పాలకుల సంక్షేమ పథకాలు కొనసాగి స్తూ అదనంగా నూతనంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజా ప్రభుత్వం చేపట్టిందని అన్నారు.

గత పాలకులు తీసుకుని వచ్చిన ధరణి చట్టం వల్ల కేవలం పాలకుల కుటుంబ సభ్యులు మాత్రమే లబ్ది పొందారని, అనేక మంది రైతులకు కన్నీళ్లు మిగిల్చిన ధరణి చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసి భూ సమస్యల పరిష్కారానికి అద్భుతమైన భూ భారతి చట్టం ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు.

Join WhatsApp

Join Now