బ్రేకింగ్ న్యూస్….
నిర్మల్ జిల్లా: బాసరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాసర గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి.
గోదావరి నదిలో గల్లంతు అవడం కళ్లారా చూసిన పలువురు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో హుటాహుటిన పోలీసులు వచ్చిన గాలింపు చర్యలు చేపట్టారు.
నలుగురు మృతదేహాలు లభ్యమవగా, మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మృతులంతా హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ వాసులుగా గుర్తింపు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగానూ నిర్ధారించారు.
బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చి. తిరుగు ప్రయాణంలో స్నానానికి వెళ్లగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.
అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.