జిల్లాస్థాయి క్రీడల ఎంపిక కార్యక్రమం

జిల్లాస్థాయి క్రీడల ఎంపిక కార్యక్రమం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 23

 

వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, SATG, తెలంగాణ వారి ఆదేశాల అనుసారము తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్, హకీంపేట్, ప్రాంతీయ క్రీడ పాటశాల, కరీంనగర్ మరియు ఆదిలాబాద్ లో 20 బాలురు మరియు 20 బాలికలు చొప్పున 2025-26 సంవత్సరానికి గాను నాల్గవ (IV) తరగతిలో ప్రవేశానికి ఎంపిక కొరకు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ కార్యాలయము, కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎంపిక కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో తొమ్మిది రకాల క్రీడ పోటీలు నిర్వహించి ఉత్తమమైనటువంటి పదిమంది బాలురు పదిమంది బాలికలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలలో ఒకటి మరియు రెండవ జూలై రోజున అకీంపేట్ స్కూల్, హైదరాబాద్ లో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలు నిర్వహిస్తారని తెలిపినారు. రాష్ట్ర స్థాయిలో కూడా మన జిల్లా బాలురు బాలికలు ఉత్తమ ప్రతిభ చూపించాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఇందులో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియంలో మొక్కలు నాటినారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి, తాసిల్దార్ కామారెడ్డి, SGF సెక్రెటరీ హీరలాల్, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment