ప్రశ్న ఆయుధం న్యూస్ జూన్ 23 కొత్తగూడెం డివిజన్ ఆర్ సి
అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్
నూతనంగా ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ వెంకటస్వామి ని హైదరాబాద్ మంత్రి నివాసంలో పూల బొకేను అందజేసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేసి మద్దెల మాట్లాడారు.దళితుల ఆశాజ్యోతి
కేంద్ర మంత్రిగా,శాసనసభ్యులుగా,
పేద వర్గాల ప్రతినిధిగా కార్మిక పక్షపాతిగా విశిష్ట సేవలందించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతనుమొట్టమొదటి అప్పటి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరియు సోనియా గాంధీ దృష్టికి తీసుకువెళ్లి చరిత్రలో నిలిచిపోయిన,ఆనాడే పేదవారికందరికీ గుడిసెలను కట్టించి గుడిసెలవెంకటస్వామిగా, కాకాగా ప్రసిద్ధికెక్కిన స్వర్గీయ గడ్డం వెంకట స్వామి ఆశయాల వారసుడిగా మరియు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల వారసుడిగా నిరంతరం కృషి చేస్తూ,బాబా సాహెబ్ కలలుగన్న సమసమాజ స్థాపనకై,
అహర్నిశలు కృషి చేస్తూ, ఈనాడు తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రివర్యులు గా ప్రమాణ స్వీకారం చేసి
గనులు మరియు కార్మిక శాఖ వంటి ప్రతిష్టాత్మక శాఖను చేపట్టిన మంత్రి గడ్డం వివేక్ అందరి ఆధార అభిమానాలు పొందాలని కోరుతూ అభినందించారు.ఈ సందర్భంగా సామాజిక సేవకులు కుసుమ జోగరాజ్, జాతీయ మాల మానాడు అధ్యక్షులు చెన్నయ్య, తలమల హసన్, అల్లం శంకర్, తదితరులు ఉన్నారు.
నూతన మంత్రి గడ్డం వివేక్ డాక్టర్ మద్దెల శివకుమార్ ఘనంగా సన్మానం
by Naddi Sai
Published On: June 23, 2025 7:26 pm
