*ఎస్సై అశోక్, కానిస్టేబుల్ బ్లెసన్ జీవన్ మృతదేహాలకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సత్యానందరావు….*
విధి నిర్వహణలో భాగంగా హైదరాబాద్ వెళ్తూ కోదాడ సమీపంలో ప్రమాదానికి గురై ప్రాణాలొదిలిన ఆలమూరు ఎస్సై అశోక్, కానిస్టేబుల్ బ్లెసన్ జీవన్ మృతదేహాలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘన నివాళులర్పించారు. సంఘటనాస్థలానికి బయల్దేరిన ఎమ్మెల్యే బండారు మార్గమధ్యంలో ఎస్సై అశోక్, కానిస్టేబుల్ బ్లెసన్ జీవన్ ల మృతదేహాలు తీసుకువస్తున్న వాహనం ఎదురుకావడంతో వెంటనే కారు దిగి అమరవీరులకు నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు ఒదిలిన ఆ అమరవీరుల మృతదేహాలను చూసి ఎమ్మెల్యే చలించిపోయారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.