ఆర్‌అండ్‌బి అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మోహన్ బాధ్యతల స్వీకరణ

ఆర్‌అండ్‌బి అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మోహన్ బాధ్యతల స్వీకరణ

 

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూన్ 30

 

కామారెడ్డి జిల్లాలో కొత్తగా నియమితులైన రోడ్లు, మరియు భవనాల, శాఖ (ఆర్‌అండ్‌బి) ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ గా పి. మోహన్, బాధ్యతలు సోమవారం స్వీకరించారు. ఈ మేరకు ఆయన, ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కె. రవి శంకర్, నుంచి అధికారికంగా బాధ్యతలు స్వీకరించార‌ని, అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా రోడ్ల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకుంటానని మోహన్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా శాఖ అధికారులు, సిబ్బంది మోహన్‌కు అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now