ఆశ వర్కర్ల జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయలి 

ఆశ వర్కర్ల జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయలి

 

– సిఐటియు జిల్లా కన్వీనర్ కే చంద్రశేఖర్

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

( ప్రశ్న ఆయుధం) జూన్ 30

 

జులై 9 నా జరిగే దేశవ్యాప్తంగా సమ్మెలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ( సిఐటియు ) పాల్గొంటుందని రోజు ఆశ వర్కర్లకు సెలవు ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమ్మె నోటీస్ ను అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కన్వీనర్ కే చంద్రశేఖర్ మాట్లాడుతూ శతాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టలను రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను, తీసుకువచ్చి వాటి అమలుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నదన్నారు. ఈ చర్య భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19/1సి ఆర్టికల్ 21, 24 39(డి) కి కోర్స్ అమలు జరిగితే కార్మిక సంఘాల ఏర్పాటు కష్టతరం అవుతుందన్నారు. ఈ కోడ్ల వల్ల కార్మికులు సమ్మె హక్కు తొ పాటు ఉద్యోగ భద్రత ఉపాధి కోల్పోతారు. పరిమితులు ఏర్పడతాయి వీటితో పాటు ఆరోగ్య రంగాన్ని ప్రైవేటుకరణ చేస్తూ నిర్వీర్వం చేస్తున్నది. ఆశా వర్కర్లకు నేటికీ స్థిర కనీస వేతన నిర్ణయం చేయకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. 2025 జూలై 9 జరిగే దేశ సమ్మెలో తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించామన్నారు. వివాదాల చట్టం 1947 లోని సెక్షన్ 22 సబ్ సెక్షన్ (1)ని అనుసరించి సమ్మె నోటీస్ జరిచేస్తున్నాము చేస్తున్నాము అని పేర్కొన్నారు. నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. 29 కార్మిక చట్టం పునర్దించాలి ఆ శాఖ వర్కర్ల ను కార్మిక చట్టం పరిధిలోకి తేవాలి, ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 నిర్ణయించాలి,

ఆశా వర్కర్లను (ఎన్.హెచ్.ఎం) నీ శ్వాసిత ఆరోగ్య కార్యక్రమం పథకంగా నిర్ణయించాలి, ఆశా వర్కర్లను మూడో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి,

దేశవ్యాప్తంగా ఒకే విధమైన పని పద్ధతిని అమలులోకి తేవాలి . వేతనంతో కూడిన ప్రస్తుత సెలవులు 20 రోజుల క్యాజువల్ సెల్లులు, వేతనంతో కూడిన మెడికల్ సెలవులను నిర్ణయించాలి, రిటర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ ప్రకటించే వరకు పదవి వివరణ ఉండరాదన్నారు. సీనియార్టీ ప్రతిపాదికన ఆశ వర్కర్లను (ఏఎన్ఎం) పోస్టుల్లో పదోన్నతి కల్పించాలి అన్ని పీహెచ్సీలు, జిల్లా, రాష్ట్ర ఆస్పత్రులలో ఆశలకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలి, విధుల నిర్వహణ కోసం ఆశా వర్కర్లకు స్కూటర్ ఇవ్వడంతో పాటు దానికి అయ్యే పెట్రోల్ ఖర్చులను చెల్లించాలి, ఆన్లైన్ పని కోసం మంచి నాణ్యమైన ట్యాప్ ట్యాబులు డేటా ప్యాక్ నెట్వర్క్ ఇవ్వడంతో పాటు సరైన శిక్షను అందించాలి, ఆరోగ్యం ఆసుపత్రులతో సహా అన్ని ప్రాథమిక సేవలు ప్రవేట్ కరిన ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి

, ప్రభుత్వ రంగ సంస్థల పిఎస్ఈ లు, సేవలను ప్రైవేటు కరణ చేయరాదు , రైతుల వ్యవసాయ కార్మిక సమస్యలు పరిష్కరించాలి, నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుదలను నియంత్రించాలి, లేనిపక్షంలో దేశవ్యాప్త సమ్మెతో పాటు అనేక పోరాటలు చేయవలసి వస్తుందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కే రాజనర్సు, సిఐటియు నాయకులు కిషన్ నాయక్, నర్సింలు, బాల్ నర్స్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment