*రూరల్ సీఐగా బాధ్యత స్వీకరించిన లక్ష్మీనారాయణను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు*
*జమ్మికుంట జూన్ 30 ప్రశ్న ఆయుధం*
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాధారణ బదిలీల్లో భాగంగా సోమవారం జమ్మికుంట రూరల్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీనారాయణను కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సన్మానించారు జమ్మికుంట రూరల్ సీఐగా విధులు నిర్వహించి బదిలీపై వెళుతున్న జమ్మికుంట రూరల్ సీఐ కిషోర్ ను శాలువాతో సన్మానించి వీడ్కోలు పలికారు. రెండు సంవత్సరాలు సంపూర్ణంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా విధులు నిర్వహించిన సిఐ కిషోర్ కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దేశిని కోటి సుంకరి రమేష్ జిల్లెల్ల తిరుపతిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మధుసూదన్ రెడ్డి మర్రి శ్రీనివాస్ రెడ్డి డాన్ రమేష్ విష్ణువర్ధన్ రెడ్డి కృష్ణ వనపర్తి రెడ్డి అమర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.