1. దోస్త్ వెబ్‌సైట్ ద్రోహం!
2. ప్రైవేటు కోసం ప్రభుత్వమే కుట్ర?
3. ఖాళీ ఉన్నా సీట్లు లేవంటారెందుకు?
4. దోస్త్ స్కాం – విద్యార్థుల భవిష్యత్తు పాడు!
‘ప్రభుత్వ డిగ్రీ కళాశాలల మెడలపై దోస్త్ ప్రై’వేటు’!తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను మూసివేసే కుట్ర జరుగుతోంది. ప్రైవేటు కళాశాలలకు మేలు చేయడానికి, లాభాలు పదింతలు చేయడానికి తద్వారా తమ బొక్క సాలు నింపుకోవడానికి ఒక ప్రక్క కృషి జరుగుతోంది. అది ఎవరు చేస్తున్నారో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ దారుణానికి ఒడిగట్టింది సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే. ప్రభుత్వమే ప్రభుత్వ కళాశాలలను నిర్వీర్య పరుస్తున్నది. ప్రభుత్వ కళాశాలలో సీట్లు లేవంటూ ప్రభుత్వమే మోసం చేస్తున్న సంగతి విచిత్రం. ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీగా బోలెడు, అక్షరాల లక్షలాది సీట్లు ఉన్నాయి. కానీ సీట్లు నిండిపోయాయంటూ దోస్త్ వెబ్సైటు విద్యార్ధులకు ప్రైవేటు కళాశాలల్లో సీట్లను కేటాయిస్తున్నారు. దాంతో ప్రభుత్వ కళాశాలల్లో చదవాలనుకుంటున్న వేలాది మంది విద్యార్థులు ప్రై’వేటు’ కు గురువుతున్నారు. అంతే కాకుండా, దోస్త్ అన్ని ఫేజ్ లకు దశల వారిగా సీట్లు కేటాయించారు. అన్ని సీట్లు కేటాయించినట్లు చూపారు. సెల్ఫ్ రిపోర్టింగ్ దశలవారీగా అనుమతించారు, కానీ రిపోర్టింగ్ మాత్రం అన్ని దశల వారికి ఒకేసారి నిర్వహించడం వలన, అందరూ జాయిన్ అవ్వక పోవడం వల్ల సీట్లు మిగిలి పోయాయి. అంతే కాక ప్రైవేట్ వారికి స్పాట్ అడ్మిషన్ చేసుకునే అవకాశం ఇచ్చారు, కానీ ప్రభుత్వ కళాశాలకు ఆ అవకాశం కల్పించకపోవడం అంటే ప్రభుత్వ కళాశాలల ఉసురు తీయడమే కదా! చాలా పద్దతి ప్రకారం, ఎవ్వరికీ గుర్తు తెలియకుండా జరుగుతున్న ఈ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తెలియాల్సి ఉంది.